భార్యను గొంతు నులిమి చంపిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగుబాటు
- December 29, 2017
కువైట్ : ఇటీవల సంచలనం కల్గించిన జహ్రా లోని తైమ ప్రాంతంలో 22 ఏళ్ల మహిళ హత్య కేసులో అనుమానితుడు హతురాలి భర్తను పోలీసులు అదుపులో తీసుకొన్నారు. తన భార్య తో కొన్ని సమస్యలు కలిగిఉన్నట్లు ఆ గొడవలు ఒక ప్రతిష్టంభన దశకు చేరుకున్నాయని ఆ నేపథ్యంలో ఆమెని తానె స్వయంగా అంతమొందించినట్లు ఒప్పుకున్నాడు. అనుమానితుడు తన భార్యను జహ్రా క్లబ్ పార్కింగ్ స్థలంలోకి తీసుకువెళ్ళి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకొందామని యత్నించానని అయితే మా ఇరువురి మధ్య వాగ్యువాదం తీవ్ర స్థాయికి చేసారుకోవడంతో పట్టరాని కోపంతో తన భార్య గొంతు నులిమి చంపినట్లు డిటెక్టివ్లకు నిందితుడు చెప్పాడు. తన తండ్రి అంతర్గత వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నాడని తన భార్యతో ఏర్పడిన తగాదా గురించి చెప్పి మీ కోడలను చంపివేసినట్లు తన తండ్రికి చెప్పడం జరిగిందని..ఆయన సూచనతో తైమా పోలీసు స్టేషన్ వద్ద పోలీసులకు లొంగిపోయినట్లు నిందితుడు తెలిపాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







