మత్తులో కారులో జుగుతున్న డ్రగ్గ్ బాబు మరియు అక్రమ మాదకద్రవ్యాల సరఫరాదారుని అరెస్ట్

మత్తులో కారులో జుగుతున్న డ్రగ్గ్ బాబు  మరియు అక్రమ మాదకద్రవ్యాల సరఫరాదారుని అరెస్ట్

కువైట్: అక్రమ మాదక ద్రవ్యాలను కలిగివున్న నేరంపై ఒక పౌరుడు అరెస్టు చేయబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు తనిఖీ వాహనంలో గస్తీ నిర్వహిస్తుండగా ఒక బహిరంగ ప్రదేశంలో నిలిపిన తన వాహనంలో మత్తుగా ..నిస్సత్తువుగా పడిపోయి ఉన్న ఒక వ్యక్తిని గమనించారు. కొంతసేపు మాత్రమే ఇక్కడ  విశ్రాంతి తీసుకుంటున్నానని అనుమానితుడు పోలీసులతో పేర్కొన్నాడు. అయితే తన పక్కన ఉన్న  డిష్డాషా మరియు ప్రయాణీకుల సీటులో సిగరెట్ మండే నుసి జాడలు ఉన్నాయని గమనించారు. దానితో అనుమానం కల్గిన పోలీసులు అనుమానితుని వాహనం తనిఖీ చేయగా వాహన రహస్య అరలలో మాదక ద్రవ్యం కనుగొనబడ్డాయి. మరో కేసులో ఒక పౌరుడు కైఫాన్లోని ఆయుధ పరిశోధకుల తనిఖీలో  మాదకద్రవ్యాలతో దొరికిపోయాడు. దాంతో ఆ నిందితుడిని అరెస్టు చేశారు, చట్టవిరుద్ధమైన మాత్రలు ఆ నిందితుని పెద్ద సంచిలో ఉన్నట్లు కనుగొన్నారు.  అనుమానితుడు ఒక మాదకద్రవ్య బానిస మరియు మాదకద్రవ్యాలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించేవాడినని తనిఖీ అధికారుల ఎదుట ఒప్పుకున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.

Back to Top