జనవరి 1న ఆడపిల్ల పుడితే..బంపర్ ఆఫర్

జనవరి 1న ఆడపిల్ల పుడితే..బంపర్ ఆఫర్

నూతన సంవత్సరం రోజున జన్మించే మొదటి ఆడపిల్లకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది.. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని పాలికె ఆసుపత్రుల్లో జన్మించే మొట్టమొదటి ఆడపిల్లపై కనకవర్షం కురిపిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి 12 గంటలు, ఆతరువాత జన్మించే ఆడపిల్లకు రూ. 5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని బృహత్ బెంగళూరు మహానగర పాలికె మేయర్ సంసత్ రాజ్ ప్రకటించారు. ఆ చిన్నారి పేరు బీబీఎంపీ కమిషనర్ పేరుతో జాయింట్ బ్యాంక్ ఖాతా తెరిచి రూ. 5 లక్షలు నగదు డిపాజిట్ చేస్తామని సంపత్ రాజ్ తెలిపారు. సాధారణ ప్రసవం ద్వారా జన్మించే ఆడపిల్లకు మాత్రమే రూ. 5 లక్షలు ఇస్తామని మేయర్ స్పష్టం చేశారు. ఆడపిల్లకు 18 ఏళ్లు పూర్తి అయిన తరువాత ఆమె విద్యాభ్యాసం కోసం రూ. 5 లక్షలు వినియోగించుకోవచ్చని బృహత్ బెంగళూరు మాహానగర పాలికె సంపత్ రాజ్ చెప్పారు. 

Back to Top