అపర దానకర్ణుడు ఆ సౌదీ పౌరుడు... నెటిజన్ల ప్రశంసలు

- December 29, 2017 , by Maagulf
అపర దానకర్ణుడు ఆ సౌదీ పౌరుడు... నెటిజన్ల ప్రశంసలు

రియాధ్: గుప్పెడు గింజలు గుంపునకు ఇచ్చి... బారెడు ప్రచారం కోరుకొనే లోకంలో ఎవరో తెలియని ఒక బాలికకు కు తన మూత్రపిండం ఒక దానిని  దానం చేశారా సౌదీ పౌరుడు. పదేళ్ల బాలిక నాలుగేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతోందని తెలిసి.. మహమ్మద్ జొమ్మాహ్ అల్ బొన్నా అనే 34 ఏళ్ల సౌదీ పౌరుడు తీవ్రంగా స్పందించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఆయన  ఆమె గురించి తెలుసుకున్నాడు. చిన్న వయస్సులో పాడైన కిడ్నీ తో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ బాధపడుతున్న విషయం తెల్సి బాధపడ్డాడు. ఓ సౌదీ దినపత్రికలో వచ్చిన ఓ మానవీయ కధనాన్ని చదివిన ఆయన   నేరుగా ఆమె గురించి పూర్తి వివరాలను తెలుసుకుని... ఆసుపత్రికి వెళ్లి.. తన కిడ్నీని ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడు. తబుక్‌లోని కింగ్ సల్మాన్ అర్మ్‌డ్ ఫోర్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ బాలికకు కిడ్నీని ఇచ్చి సౌదీ వ్యాప్తంగా వార్హలలోని ప్రముఖ వ్యక్తి  అయ్యాడు.  నెటిజన్లు ఆయనను కీర్తిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన కూతురు ఇక దక్కదని అనుకున్నాననీ, తన ప్రాణాలపై ఆశలు కోల్పోతున్న తరుణంలో వచ్చి ఆదుకున్నాడని మహ్మద్ బొన్నాహ్‌ను పాప తండ్రి ముబారక్ అల్ ఏంజీ కీర్తించాడు. తన కుమార్తెకు రెండో జీవితాన్ని అందించాడని, ఆయన చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com