అమెరికాపై జీహాద్‌ ప్రకటించిన హఫీజ్

- January 02, 2018 , by Maagulf
అమెరికాపై జీహాద్‌ ప్రకటించిన హఫీజ్

అమెరికా.. పాకిస్థాన్‌ల‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నో మోర్‌ ఫండ్స్‌ అంటూ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు చేస్తే.. అందుకు కౌంటర్‌గా పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌ హఫీజ్‌ ఆ దేశంపై జిహాద్‌ ప్రకటించాడు. పాకిస్థాన్‌ ఇక అణుబాంబును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. 

26/11 ముంబయి ఉగ్రదాడి ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్‌ అమెరికా, ఇజ్రాయిల్‌పై జిహాద్‌ ప్రకటిస్తూ లాహోర్‌లో ర్యాలీ చేపట్టాడు. ఈ ర్యాలీలో హఫీజ్‌తో పాటు, జమాత్‌-ఉద్‌-దవా నేత అబ్దుల్‌ రెహమాన్‌ కూడా పాల్గొన్నాడు. ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీని చేపట్టారు. ట్రంప్‌ వ్యాఖ్యలతోనే ఈ ర్యాలీ చేపట్టారన్నది బహిరంగ రహస్యం..

పాకిస్థాన్‌ అణ్వాయుధం ఇస్లాం ఆస్తి.. జెరూసలెం విషయంలో దీన్ని ఉచితంగా వినియోగించవచ్చు. ఇది తన బహిరంగ ప్రకటనంటూ హెచ్చరికలు చేశాడు సయీద్‌. ఇస్లామిక్‌ దేశాల చీఫ్‌లతో సదస్సు ఏర్పాటు చేసి జిహాద్‌ ప్రకటిస్తున్నాం అని వెల్లడించారు. రాను రాను ఐసిస్‌ ప్రభావం తగ్గిపోతూ వస్తోందని.. పవిత్ర యుద్ధం అంతానికి అమెరికా కుట్రలు చేస్తోందని సయీద్‌ తీవ్ర వ్యాక్యలు చేశాడు. రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న హఫీజ్‌ను పాక్‌ ఎప్పుడూ వెనుకేసుకొస్తోంది. అతడిని అరెస్టు చేయడంలోనూ జాప్యం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com