సౌదీలో 3 లక్షల 37 వేల మంది అక్రమ నివాసితులు అరెస్ట్ !

- January 05, 2018 , by Maagulf
సౌదీలో  3 లక్షల 37 వేల మంది అక్రమ నివాసితులు  అరెస్ట్ !

రియాద్ : ' ఉంటే ..ఈ ఊర్లో ఉండు...లేదంటే , నీ దేశం పోరా '  అయితే సౌదీ అరేబియా దేశంలో ఉండాలంటే సక్రమ అనుమతి ఖచ్చితంగా ఉండాలి. దాంతో అక్రమ నివాసితులపై సౌదీఅరేబియా కఠినమైన చర్యలు తీసుకోనుంది . అక్రమంగా నివాసముంటున్నవారికి దెస బహిష్కరణ విధించనున్నారు. పలు ప్రాంతాలలో తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకూ 3,37,281 మందిని అదుపులోనికి తీసుకొన్నారు.. వీరివద్ద  సరైన నివాస అనుమతిలేని కారణంగా  1,98,231 మందిని , పని అనుమతి  లేని 99,000 మంది అరెస్టైన వారిలో ఉన్నారు. నవంబర్ 15న ప్రారంభమైన ఈ చర్యల్లో భాగంగా అక్రమంగా నివసిస్తూ పట్టుబడ్డ 65,715 మంది వలసజీవులను స్వదేశాలకు పంపించేశారు. వీరిలో అధికంగా యెమన్, ఇథియోపియా, ఆఫ్రికన్ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఇదిలావుండగా సౌదీలో అక్రమంగా నివసిస్తున్నవారు ఎలాంటి జరిమానా చెల్లించకుండా వెళ్లిపోవచ్చునని గతేడాది మార్చిలో సౌదీలో ప్రకటించింది. ప్రస్తుతం అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన వారికి 15,000 నుంచి 1,00,000 రియాల్స్ జరిమానా విధిస్తున్నారు. చెల్లించిన అనంతరం స్వదేశాలకు పంపిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com