జీబ్రా వేషంలో వెళ్లి సింహాలకు చిక్కారు
- January 07, 2018
ఇద్దరు జంతు ప్రేమికులు జీబ్రా వేశంలో వెళ్లి క్రూర జంతువులైన సింహాలకు చిక్కిన సంఘటన సౌత్ఆఫ్రికాలో చోటు చేసుకుంది.. ఎప్పుడో జరిగినా ఈ ఘటన ప్రస్తుతం యూట్యూబ్ లో వీక్షకులను ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే సౌత్ఆఫ్రికాకు చెందిన క్రీస్ , స్టీవ్ అనే ఇద్దరు జంతు ప్రేమికులు జతువుల వేశంలో వెళ్లి వాటి హావభావాలు తెలుసుకుందామని అనుకున్నారు. దీంతో అనుకున్నదే తడవుగా వారు ఓ జీబ్రా వేషం ధరించారు. సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ కు దగ్గరలో కేఓరా అనే ప్రాంతంలో క్రూరజంతువులుండే చోటుకు వెళ్లారు. పైగా వారు జీబ్రా వేషధారణలో ఉన్నట్టు ఇతర జంతువులకు తెలియకుండా అక్కడ ఉన్న జీబ్రా సమూహంలో కలిసి వాటితో ఆటలాడుతున్నారు. ఇంతలో అక్కడికి రెండు సింహాలు వచ్చి ఆ సమూహంపై దాడి చేశాయి. అంతే ఎక్కడివక్కడ, భయంతో పారిపోయాయి. అయితే ఆ సింహాలకు జీబ్రా వేషంలో ఉన్న మనుషులు అక్కడే ఉండటం చూసి వాసన చూసి ఆగిపోయాయి.
అంతే ఉన్న వారు సరిగా ఉండకుండా ఆ రెండు సింహాలను అదిరించి బెదిరించసాగారు. దాంతో మొదట్లో అవి బయపడినట్టు నటించినా ఆ తరువాత ఒక్క వుదుటన వారిపైకి దూకేసాయి సింహాలు. దాంతో జీబ్రా తొడుగు ఊడి కిందకు పడిపోయింది. అందులో ముందున్న వ్యక్తి జీబ్రావేషం తలభాగం ఒక సిమహానికి చిక్కింది. ఇక మంచి భోజనం దొరికిందిలే అనుకుని వెళ్లిపోయింది. ఇక రెండవ సింహం బారినుంచి తప్పించుకున్న క్రీస్ , స్టీవ్ లు అక్కడనుంచి ప్రాణభయంతో పారిపోయారు. అయితే తలభాగం దొరకడంతో ఒక చోట ఆగి దాన్ని తినే ప్రయత్నం చేయగా, అది మాంసం కాదు తోలనుకుని చీల్చేసింది సివంగి. అంతే అందులో ఉన్న మెత్తటి కాటన్ గుడ్డ బయటపడింది. ఇదిలావుంటే సరదాగా చేసిన పని వారి ప్రాణం మీదకు రావడంతో ఫారెస్ట్ అధికారులు జరిగింది తెలుసుకుని ఇద్దరికీ కౌన్సలింగ్ ఇచ్చి పంపించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







