జైసింహాలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ తెలుసా..!

- January 11, 2018 , by Maagulf
జైసింహాలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ తెలుసా..!

సంక్రాంతి కానుకగా రేపు విడుదల కాబోతున్న జై సింహా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లో వచ్చిన డైలాగ్స్‌ను బట్టి ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. బాలయ్య చెప్పిన ఒక్కొక్క డైలాగ్ నందమూరి అభిమానుల అంచనాలు రెట్టింపు చేశాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో పవర్ ఫుల్ డైలాగ్ హాల్‌చల్ చేస్తుంది. నువ్వెంత బెదిరిస్తే.. నేనంత ఎదురొస్తా.. బొమ్మ తిరగేస్తా.. అంటూ బాలయ్య చెప్పే ఈ డైలాగ్ అభిమానుల హుషారును పెంచేసింది.  57 సంవత్సరాల వయస్సులో కూడా యంగ్ హీరోలా మాస్ డైలాగ్‌లు చెబుతుంటే  థియేటర్లలో ఈలలు  మారుమోగడం ఖాయం.  మరోసారి  జై సింహా ద్వారా తన  పవర్ ఏంటో తెలుస్తోందని అభిమానులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com