దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్.. అన్ని రకాల కోనుగోళ్లపై 90 శాతం డిస్కౌంట్..
- January 11, 2018
దుబాయ్: ' భలే మంచి చౌక బేరమూ ' అంటూ పలువురు వినియోగదారులు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడ అన్ని రకాల కోనుగోళ్లపై 90శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. 23వ షాపింగ్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని ఈ బ్రహ్మాండమైన అవకాశం అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని కల్గించేందుకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజన్ లో ఎక్కువ మంది టూరిస్టులు షాపింగ్ చేసేందుకు దుబాయ్ వస్తుంటారన్నారు. మిర్డిఫ్ సీటి సెంటర్‌లోని అల్ సాలామ్ స్టోర్స్ అన్నింటిలోనూ అన్ని రకాల కోనుగోళ్లు జరిపే వినియోగదారులకు 90 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని వారు చెప్పారు. ఉదయం గం.10ల నుంచి స్టాక్ ఉన్నంతవరకు కోనుగోళ్లు జరుపుకోవచ్చని వారు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







