సౌదీ అరేబియాలో మహిళలకు మాత్రమే మొట్టమొదటి కారు షోరూమ్
- January 12, 2018
జెడ్డా: కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా ఒక కారు షోరూమ్ ను ఒక సౌదీ ప్రైవేట్ కంపెనీ గురువారం ప్రారంభించారు. ఐదు నెలల క్రితం మహిళలు కారు డ్రైవింగ్ చేయవచ్చని ప్రభుత్వం ఒక నిర్ణయం చేయడంతో కేవలం మహిళల కోసం మొదటి కారు ప్రదర్శనశాల ప్రారంభమైంది.ఈ షోరూంను జెడ్డాలోని పశ్చిమ రెడ్ సీ పోర్ట్ సిటీ షాపింగ్ మాల్ లో మొదలయింది. మహిళలు వారికి ఇష్టమైన సొంత కార్లను ఎంచుకోవడానికి స్వేచ్ఛను ఈ కారు షోరూమ్ లో అనుమతించారు.గత ఏడాది చివరలో చారిత్రాత్మక నిర్ణయం కారణంగా సౌదీ మహిళలకు తిరిగి డ్రైవింగ్ చేసే అవకాశం సౌదీ రాజు కల్పించారు. మతపరమైన కారణాల ఆధారంగా దాదాపు మూడు దశాబ్దాల పాటు మహిళలు డ్రైవింగ్ నిషేధం కొనసాగింది. ఆరు నెలల క్రితం దీనిని రద్దు చేసి మరల డ్రైవింగ్ చేసే అవకాశం సౌదీ స్త్రీలకి వచ్చింది. షోరూమ్ లో వివిధ రకాల కార్ల తయారీదారుల నుండి పలు కార్లను విస్తృత ఎంపిక చేసుకొనే సదుపాయం స్త్రీలకు అందిస్తోంది మరియు ఇక్కడ ఉద్యోగులుగా మహిళలు మాత్రమే పనిచేస్తారు.ఇది ప్రముఖ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల ద్వారా అందించిన కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక పరిష్కారాలతో మహిళలకు అందిస్తుంది. చమురు సంపన్న రాజ్యంలో మహిళలకు మరిన్ని ఆటోమొబైల్స్ దుకాణాలను తెరవాలని కారు షోరూమ్ సంస్థ యోచిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!