అరబ్ బాలుడి పట్ల భారతీయ వాచ్‌మన్ అకృత్యం ..మూడు నెలల జైలుశిక్ష..దేశ బహిష్కరణ

- January 13, 2018 , by Maagulf
అరబ్ బాలుడి పట్ల భారతీయ వాచ్‌మన్ అకృత్యం ..మూడు నెలల జైలుశిక్ష..దేశ బహిష్కరణ

దుబాయ్: కామంతో ...కన్నూ ..మిన్నూ కానరాని ఓ భారతీయ నైట్ వాచ్మెన్ ముక్కుపచ్చలారని అరబ్ బాలునితో అసహజ కామవాంఛలు తీర్చుకోబోయి నిఘా కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిపోయాడు. ఆ  నేరం రుజువుకావడంతో మూడు నెలల జైలుశిక్షతోపాటు దేశ బహిష్కరణకు గురయ్యాడు. యూఏఈలో జరిగిన ఈ నేరానికి సంబంధించిన వివరాల ప్రకారం భారతదేశానికి చెందిన ఓ 37 ఏళ్ల వ్యక్తి దుబాయ్ నగరంలోని సీసీ కెమేరాల పర్యవేక్షణ రూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అన్నిచోట్ల నిఘా ఉంటుందని ..పర్యవేక్షణ రూమ్ లో కెమెరాలు గట్రా   ఉండదని బహుశా కాబోలు 6 ఏళ్ల వయసున్న ఓ అరబ్ బాలుడికి మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లి  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలుడికి ముద్దులు పెట్టడంతోపాటు...పలుచోట్ల అసభ్యకరంగా చేతులు పెట్టి తడిమేడు. ఈ వికృత ఈ దృశ్యాలన్నీ సీసీ కెమేరాల్లో ఎంచక్కా రికార్డయ్యాయి. బాలుడు తనకు ఎదురైన పరిస్థితిని కుటుంబసభ్యులకు వెల్లడించడంతో చేసిన పాపం వెలుగులోకి వచ్చింది. దాంతో  నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం ఎన్నో ఆధారాలతో సహా రుజువుకావడంతో నిందితుడికి మూడు నెలల జైలుశిక్ష విధించారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత  దేశం నుంచి వెళ్లగొట్టాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com