సౌదీలో మొదటిసారిగా స్టేడియం లోకి మహిళలు
- January 13, 2018
పురుషుల ఫుట్బాల్ క్రీడ తిలకించడానికి మొట్టమొదటి సారిగా సౌదీ అరేబియాలోని మహిళలను అనుమతించారు. దీంతో నలుపు రంగు వస్త్రధారణ, ఫ్లోరెసెంట్ నారింజ దుస్తులు ధరించిన మహిళలు శనివారం రాజు అబ్దుల్లా స్టేడియంలోని గేట్లు వద్ద నిలబడి మ్యాచ్ను వీక్షించారు. అల్-అహ్లీ, అల్-బాటిన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోటీలకు మహిళలు వారి భర్తలతో, పిల్లలతో, మిత్రులతో కలిసి వీక్షించారు. జెడ్డాలోని డమ్మామ్, రియాద్ స్టేడియాలను 2018 లో ప్రారంభించి కుటుంబాలను ఆహ్వానిస్తామని గత అక్టోబర్లోనే జనరల్ స్పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం చాలా కాలం క్రితమే జరిగిఉండాల్సిందని ఈ క్రీడకు హాజరైన వారిలో ఒకరు పేర్కొన్నారు. బహిరంగ క్రీడా కార్యక్రమంలో మహిళలు పాల్గొనడానికి అనుమతించే నిర్ణయంతో దేశంలో మంచి మార్పును తెస్తుందని ఆశిస్తున్నారు.. కొన్ని నెలల క్రితం మహిళలు కారు నడిపే హక్కును సౌదీ అరేబియా ప్రకటించిన అనంతరం గురువారం వారి కోసం మొట్టమొదటి కారు ప్రదర్శన ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







