నిద్రకు మద్యం దెబ్బ!
- January 16, 2018పడుకునే ముందు మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందని కొందరు భావిస్తుంటారు. దీంతో మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుండొచ్చు. కానీ సమయం గడుస్తున్నకొద్దీ మత్తు ప్రభావం తగ్గిపోయి.. తరచుగా మెలకువ వస్తూనే ఉంటుంది. కోడి నిద్రే మిగులుతుంది. గాఢ నిద్ర గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా ఉదయం నిద్రలేచాక ఏమంత హుషారుగా ఉండదు. అలాగే మద్యం తాగి నిద్రపోయినవారికి కలలు వచ్చే అవకాశం ఎక్కువ. పీడకలలూ రావొచ్చు. కొందరు నిద్రలో లేచి నడుస్తుంటారు కూడా. మద్యం మత్తు కారణంగా శరీరంలోని అన్ని కండరాలు వదులవుతాయి. గొంతు వెనకాల కండరాలు వదులైతే శ్వాసమార్గానికి అడ్డంకి తలెత్తటం, గురక వంటివీ మొదలవుతాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?