బంగాళాదుంప లాలీపాప్
- January 17, 2018కావల్సినవి: ఉడికించిన బంగాళాదుంప - ఒకటిన్నర కప్పు, బ్రెడ్‌పొడి - అరకప్పు, ఉల్లిపాయముక్కలు - పావుకప్పు, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను, కారం - పావుచెంచా, ధనియాలపొడి - చెంచా, నిమ్మరసం - అరచెంచా, ఉప్పు - తగినంత. మైదా - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - వేయించేందుకు సరిపడా, ఐస్‌క్రీం పుల్లలు - కొన్ని,
తయారీ: ఓ గిన్నెలో మైదా, కాసిని నీళ్లూ తీసుకుని పిండిలా కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప తురుమూ, ఉల్లిపాయ ముక్కలూ, కొత్తిమీర తరుగూ, సగం బ్రెడ్పొడీ, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేయాలి. అన్నింటినీ బాగా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. ఒక బంగాళాదుంప ఉండను ఐస్‌క్రీం పుల్లకు అద్ది, లాలీపాప్ ఆకృతిలో వచ్చేలా చేసి ముందు మైదా మిశ్రమంలో, తరువాత మిగిలిన బ్రెడ్‌పొడిలో అద్దాలి. ఇలా మిగిలినవీ చేసుకుని రెండుచొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు