దుబాయ్ టూరిస్ట్‌కి లైంగిక వేధింపులు: నిందితుడికి జైలు
- January 19, 2018
దుబాయ్:33 ఏళ్ళ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నార్వేకి చెందిన టూరిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నేరానికిగాను న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. తన స్నేహితుడికి చెందిన కారులో నార్వే టూరిస్ట్‌ని లైంగికంగా వేధించినట్లు నిందితుడిపై ఆరోపణలు నమోదయ్యాయి. అయితే తన మీద నమోదైన ఆరోపణల్ని నిందితుడు తొలుత ఖండించాడు. 2016 డిసెంబర్ 19న ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలికి డ్రింక్‌లో మత్తు మందు కలిపి, ఆమెపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే తొలుత బాధితురాలు దొంగతనానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెకు తనపై జరిగిన లైంగిక దాడి గురించి తెలుసుకుని, ఆ కోణంలోనూ పోలీసులకు సమాచారం అందించింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడ్ని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి