అంకారా: ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

- January 20, 2018 , by Maagulf
అంకారా: ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

అంకారా: టర్కీలోని ఎస్కిసెహీర్‌ ప్రావిన్సులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్కిసెహీర్‌ - బుర్సా హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు మూడు చెట్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఎస్కిసెహీర్‌ ప్రావిన్సు గవర్నర్‌ ఒజ్డెమిర్‌, పోలీసు చీఫ్‌ ఎన్‌జిన్‌లు ప్రమాద ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com