ల్యాంప్ పోస్ట్‌లోకి దూసుకెళ్ళిన కారు: యువకుడి మృతి
- January 20, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమాలో ఓ కారు, ల్యాంప్ పోస్ట్‌లోకి దూసుకెళ్ళడంతో ఓ యువకుడు మృతి చెందాడు. షామ్ ఏరియాలోని ఘాలిలా రోడ్‌పై ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే రస్ అల్ ఖైమా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే 19 ఏళ్ళ యువకుడు ఆన్ ది స్పాట్ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన కారు, అరబ్ వ్యక్తి నడుపుతున్న మరో కారుని ఢీ కొట్టి అదే వేగంతో ల్యాంప్ పోస్ట్‌లోకి దూసుకెళ్ళింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి కారులోని వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో కారు డ్రైవర్‌ది కూడా తప్పేనని తెలియవస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!