గాయపడ్డ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారం
- January 21, 2018
యు.ఏ.ఈ:విధి నిర్వహణలో ఉండగా తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఓ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారంగా చెల్లించాలని అబుదాబీ అపీల్ కోర్ట్ ఆదేశించింది. ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు బాధ్యులుగా న్యాయస్థానం నిర్ధారించింది. కారకులైన ఇద్దరు ఆసియా కార్మికులు ఈ మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది. అబుదాబీలోని కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో బాధితుడి వెన్నుకి తీవ్రమైన గాయం తగిలింది. మిగతా శరీర భాగాలకూ గాయాలయ్యాయని మెడికల్ రిపోర్ట్ పేర్కొంది. బాధితుడు కోలుకుని, తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని సప్లిమెంటరీ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు. బాధితుడి కుటుంబానికి వేరే ఆధారం లేనందున, అతని కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, మనుగడ సాధించేందుకోసం నష్టపరిహారం తప్పనిసరి అని న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







