కొండగట్టకు బయలుదేరిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్

- January 21, 2018 , by Maagulf
కొండగట్టకు బయలుదేరిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్

హైదరాబాద్: జనసేనాని పవన్‌కల్యాణ్ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. పవన్ సతీమణి అన్నా లెజ్నోవా వీర తిలకం దిద్ది, హారతిచ్చారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో పవన్ దంపతులు సర్వమత ప్రార్థనలు నిర్వించారు. షెడ్యూల్ కంటే ముందే జగిత్యాల జిల్లా కొండగట్టుకు పవన్ కళ్యాణ్‌ చేరుకుంటారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి దర్శనం తర్వాత యాత్ర వివరాలను పవన్ వెల్లడిస్తారు. ఈ రోజు సాయంత్రం కరీంనగర్‌లో జనసేన ముఖ్య ప్రతినిధులతో పవన్ భేటీకానున్నారు. మంగళవారం కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ కార్యకర్తలో పవన్‌ భేటీ అవుతారు. తెలంగాణ పర్యటన సందర్భంగా పవన్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com