తెలంగాణాలో పట్టభద్రులకు శుభవార్త

- November 22, 2015 , by Maagulf
తెలంగాణాలో పట్టభద్రులకు శుభవార్త

నగరంలో నివసిస్తున్న పట్టభద్రులకు శుభవార్త. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఏదేనీ డిగ్రీ పొంది, 20 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఇంటరవ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైనవారికి ప్రారంభవేతనం రూ. 12 వేలు. అంతేకాక ఇతర ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికేట్లతో ఈ నెల 26న (గురువారం) విజయనగర్ కాలనీలోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి రావచ్చని, ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి కె. నాగభారతి ఓ ప్రకటనలో తెలిపారు. సమగ్ర వివరాల కోసం 81217 28818 నెంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com