స్విట్జర్లాండ్ లో 'టీఆర్ఎస్' పార్టీ శాఖ ఆవిర్భావం

- January 22, 2018 , by Maagulf
స్విట్జర్లాండ్ లో 'టీఆర్ఎస్' పార్టీ శాఖ ఆవిర్భావం

స్విట్జర్లాండ్:విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లోని పలువురు ఎన్నారైలు తెరాస పార్టీలో చేరారు. జ్యూరిచ్ నగరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలోమంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే దేశ విదేశాల్లో పార్టీ శాఖలను కలిగి ఉన్నదని, తాజాగా స్విజర్లాండ్ పార్టీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ వారందరికీ చేరేందుకు దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎన్నారైలు బంగారు తెలంగాణ సాధనలో తమతో కలిసి ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఇప్పటికే వివిధ దేశాల్లో టిఆర్ఎస్ పార్టీ శాఖల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగల స్విజర్లాండ్ పార్టీ శాఖను ఏర్పాటు చేశారు. పదిమందితో అడ్హక్ పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే పూర్తి స్థాయి టీఆర్ఎస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేస్తామని మహేశ్ తెలిపారు. ప్రస్తుతానికి శ్రీదర్ గందే, కిషోర్ తాటికొండ, అనిల్ జాల, అల్లు కృష్ణ రెడ్డి, పద్మజా రెడ్డి, పవన్ డుద్దిల, పాండు రంగారెడ్డి, రాజేందర్ బసెట్టి, ప్రవీణ్ గార్లపాటి, శైలేష్ అగర్వాల్ తో కూడిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శాఖ ఏర్పాటు కోసం డెన్మార్క్ నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి శ్యామ్ ఆకుల ప్రత్యేకంగా కృషి చేశారని మహేష్ బిగాల తెలిపారు.మేయర్ బొంతు రామ్మోహన్ కూడా మంత్రి వెంటే ఉన్నారు.

పార్టీ శాఖ ప్రారంభోత్సవ సమావేశంలో లండన్ నుండి అనిల్ కుర్మచలం, నవీన్ రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com