ఫిబ్రవరి 11 వ తేదీ వరకు తన వినియోగదారులకు ఊరెడూ ప్రత్యేక ఆఫర్లు
- January 22, 2018
మస్కట్ : ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ను ఆస్వాదించాలని పలువురు వినియోగదారులకు ఊరెడూ విలువ-ఆధారిత ఆఫర్లను ప్రారంభించింది. మస్కట్ లోని తన వినియోగదారుల కోసం ఎక్కువ కాల వ్యవధితో కూడిన మరింత డేటా పొదుపు మరియు వినోదాలతో ఊరెడూ అందిస్తుంది. షాహ్రీ మరియు షబాబియా గృహ బ్రాడ్ బ్యాండ్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యాప్ ద్వారా కంపెనీ జనవరి 18 వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వ తేదీ వరకు డిజిటల్ ప్రకృతి దృశ్యాలు పంపించనుందని ఒక పత్రికా ప్రకటనలో ఊరెడూ కంపెనీ తెలిపింది. పండుగ కాలంలో, ఊరెడూ ఒమన్ లోని తన వినియోగదారులఅందరికి ప్రతి రీచార్జ్ తో అదనపు 20, 50 మరియు 100 ఎం బి పి ఎస్ ప్లాన్ యొక్క సూపర్ ఫాస్ట్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ అందచేయబడుతుంది. చందాదారులు కూడా అదే ఫీజు తో వేగంతో కూడిన అధిక ఇంటర్నెట్ మూడు నెలల పాటు పొందుకోగలుగుతారు. అదేవిధంగా మౌసబక్ మరియు షబాబుయ్య వినియోగదారులు నిరాశ చెందనవసరం లేదు. వాటిని ప్రతి 5 రియల్ ఒమాన్ లేదా 10 రియల్ ఒమాన్ రీఛార్జ్ తో పూర్తిగా ఉచిత 9 జి బి వరకు అదనపు డేటా లభించనుంది. ఊరెడూ వినియోగదారుల విక్రయాల డైరెక్టర్ ఫెరస్ బిన్ అబ్దుల్లా అల్ షేక్ మాట్లాడుతూ, "ఒమన్ క్యాలెండర్ లో ముఖ్యమైన కార్యక్రమాలలో మస్కట్ ఉత్సవం ప్రధానమైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 24 రోజులపాటు వినోదంతో కూడిన కార్యకలాపాలను ఆస్వాదించేందుకు లక్షలాదిమందికి అవకాశమిచ్చింది. అంతకు ముందు సంవత్సరాలలో సైతం ఈ పండుగ కాలంలో మా వినియోగదారులకు ఎదురులేని ఆఫర్ల కు ఆతిధ్యం అందించేందుకు మేము గర్వపడుతున్నాం. ఎక్కువ కనెక్టివిటీ, విలువ మరియు డేటాతో ఊరెడూను శక్తివంతం చేయడానికి ఇది ఒక అవకాశంగా మలుచుకొంటున్నాం."
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు