దెయ్యంతో పెళ్లి.. చూడ్డానికి ధైర్యం కావాలిమరి

- January 24, 2018 , by Maagulf
దెయ్యంతో పెళ్లి.. చూడ్డానికి ధైర్యం కావాలిమరి

కొన్ని వినడానికి వింతగా, చదవడానికి కొత్తగా అనిపిస్తాయి. దెయ్యాలు, భూతాలు అంటూ విక్రమార్కుడి భేతాళ కథల్లో చదువుకున్న విషయాలు గుర్తుకు వస్తాయి. నిజంగా ఇలాంటివి జరుగుతాయా అని ఒకింత ఆశ్చర్యానికి గురైన సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఐర్లాండ్లో జరిగిన ఓ యువతి కథ కూడా అలాంటిదే మరి. 

ఐర్లాండ్‌లో అమందా అనే యువతి 300 ఏళ్ల కిందట చనిపోయిన ఓ ఆత్మను అట్లాంటిక్ మహాసముద్రం మధ్య తన స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. హైతీ పైరేట్ అనే అతను 1700 కాలంలో చనిపోయాడు. అతడితో తన జీవితాన్ని పంచుకున్నానని అమందా చెబుతోంది. ఐర్లాండ్‌లోని డ్రోగెడాలో తన ఇంట్లో ఉండగా హైతీ ఆత్మతో పరిచయం ఏర్పడిందని అమందా చెబుతున్నది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆరు నెలల సమయం పట్టిందని, అనంతరమే పెళ్లి చేసుకున్నామని చెబుతోంది అమందా. హైతీ తో వీకెండ్స్‌లో సినిమాలు, షికార్లు కూడా చేసేస్తోందట. నిజానికి యూకేలో ఇలా ఆత్మలను పెళ్లి చేసుకోవడాన్ని ప్రభుత్వం గుర్తించదు. అయితే కొన్ని సామాజిక వర్గాల్లో ఇది చట్టబద్ధం కావడం విశేషం. ఫ్రాన్స్‌లో కూడా ఇలాంటి చట్టం ఒకటి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో వందల మంది మహిళలకు యుద్ధంలో చనిపోయిన తమ భాగస్వాముల ఆత్మలను పెళ్లి చేసుకునే అవకాశం అక్కడి ప్రభుత్వం కలిపించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com