అవినీతి: 95 మందిపై విచారణ!

- January 25, 2018 , by Maagulf
అవినీతి: 95 మందిపై విచారణ!

సౌదీ యాంటీ కరప్షన్‌ క్యాంపెయిన్‌ ముగింపుకు వచ్చిన దరిమిలా, ఫైనాన్షియల్‌ సెటిల్‌మెంట్స్‌కి నిరాకరించిన 95 మంది నిందితులపై విచారణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పబ్లిక్‌ ప్రాజిక్యూషన్‌ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. 2017 చివరి క్వార్టర్‌లో అవినీతి వ్యతిరేక క్యాంపెయిన్‌ని చేపట్టారు. ఈ క్యాంపెయిన్‌లో చాలామంది సెటిల్‌మెంట్స్‌కి అంగీకరించారు. అలాంటివారిపై చర్యలను ఉపసంహరించడం జరిగింది. నగదు, రియల్‌ ఎస్టేట్‌, ఇతర ఆస్తులకు సంబంధించిన సెటిల్‌మెంట్స్‌ జరిగాయి. ఇంకా 95 మంది సెటిల్‌మెంట్స్‌కి నిరాకరించడంతో వారిని అరెస్ట్‌ చేయనున్నారు. 90 రోజుల విచారణలో 350 మంది అనుమానితులకు యాంటీ కరప్షన్‌ కమిటీ సమన్లు జారీ చేసింది. 1980 నుంచి అవినీతి కారణంగా దేశం చాలా నష్టపోతోందని ఈ సందర్బంగా అదికారులు పేర్కొన్నారు. క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మాట్లాడుతూ, అవినీతిపై యుద్ధం ఎప్పటినుంచో జరుగుతున్నా ఫలితాలు ఆశాజనకంగా ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రౌన్‌ప్రిన్స్‌, యాంటీ కరప్షన్‌ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. కింగ్‌ సల్మాన్‌, క్రౌన్‌ ప్రిన్స్‌ని ఈ పదవిలో నియమించారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com