సోమాలియాలో కొడుకు అదృశ్యం: సాయం కోసం సుష్మా-పవన్ కళ్యాణ్‌లకు విజ్ఞప్తి
- January 25, 2018_1516865887.jpg)
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం నెగ్గిపూడికి చెందిన భరత్ నాగేంద్ర మణికంఠ సోమాలియాలో షిప్ నుంచి అదృశ్యమయ్యారు. అతను అదృశ్యమై దాదాపు వారం రోజులు అవుతోంది. ఆయన జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తన కుమారుడి జాడ కనుగోనాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ ద్వారా తమ గోడు విన్నవించుకున్నారు. జనవరి 16వ తేదీ నుంచి అతను ఫ్యామిలీతో కాంటాక్ట్‌లో లేరు. తాను సంతోషంగా ఉన్నానని అంతకుముందు ఓ సందేశం వచ్చిందని, కానీ ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లేదని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు.
స్వదేశానికి
స్వదేశానికి బయలుదేరిన సమయంలో
పశ్చిమ గోదావరి జిల్లాలోని నెగ్గిపూడికి చెందిన దుర్గాప్రసాద్, ఝాన్సీలక్ష్మిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. కూతురుకు పెళ్లయింది. దుర్గాప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. పెద్ద కొడుకు భరత్ నాగేంద్ర మణికంఠ చెన్నైలోని వెస్ట్ లైన్ షిప్పింగ్ కంపెనీలో ఇంజనీర్ కేడర్‌గా చేరారు. శిక్షణ అనంతరం కంపెనీకి చెందిన కార్గో షిప్‌లో గల్ఫ్ వెళ్లాడు. ఇరాన్, ఇరాక్‌లలో పని ముగిసిన తర్వాత స్వదేశానికి బయలుదేరారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు