రిపబ్లిక్ డే సందర్భంగా దౌత్యపరమైన కార్యక్రమాన్నినిర్వహించిన భారత రాయబార కార్యాలయం

- January 25, 2018 , by Maagulf
రిపబ్లిక్ డే సందర్భంగా దౌత్యపరమైన కార్యక్రమాన్నినిర్వహించిన భారత రాయబార కార్యాలయం

కువైట్ : భారత 69 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ రాయబార కార్యాలయం ఒక దౌత్య కార్యక్రమంలో గురువారం స్థానిక పాటిల్ హోటల్లో పాల్గొంది. డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-జరల్లా భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ఈ సందర్బంగా పలువురు దౌత్యవేత్తలు, అధికారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేడుకను గుర్తుచేసుకోవటానికి, కువైట్ లో భారత రాయబారి గౌరవ  శ్రీ కె జీవసాగర్ మరియు ఉప విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-జరల్లా కువైట్ లో డిప్లొమాటిక్ కార్ప్ స్ డీన్ మరియు సెనెగల్ అబ్దుల్లాహ్ద్ మకాకి యొక్క రాయబారితో పాటు వివిధ దేశాల, కువైట్ అధికారులు, దౌత్యవేత్తలు, పలువురు వ్యక్తుల ప్రతినిధుల సమక్షంలో ఒక పెద్ద కేక్ ను కట్ చేసి అతిధులందరికి పంచారు. హాజరయ్యారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో శ్రీ కె. జీవసాగర్ అతిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత రాయబారి శ్రీ కె .జీవసాగర్ మాట్లాడుతూ భారత్, కువైట్  రెండు దేశాల మధ్య బలమైన మరియు లోతైన మైత్రి బంధం, పాతుకుపోయిన సంబందాలు గుర్తు చేశారు. అధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్న భారతీయ సమాజానికి మద్దతు ఇస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయిక భారతీయ సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలను అతిధులను ఆకర్షించాయి. శుక్రవారం ( రేపు ఫిబ్రవరి 26, 2018 ) భారత 69 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కువైట్ లోని రాయబారా కార్యాలయం జెండాను ఎగరవేయనుంది. ఉదయం 9:00 గంటలకు భారత రాయబార కార్యాలయం వద్ద జరిగే ఈ వేడుకకు కువైట్ లో ఉన్న భారతీయులు అందరూ హాజరు కావాలని కోరతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com