9 మందికి పద్మభూషణ్, ముగ్గురికి పద్మవిభూషణ్, 73 మందికి పద్మశ్రీ.. ఆ ప్రముఖులు వీరే!

- January 26, 2018 , by Maagulf
9 మందికి పద్మభూషణ్, ముగ్గురికి పద్మవిభూషణ్, 73 మందికి పద్మశ్రీ.. ఆ ప్రముఖులు వీరే!

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏటా విద్య, వైద్యం, కళలు, సామాజిక సేవ, సాహిత్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు 'పద్మ' పురస్కారాలను ప్రకటించి గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు 2018 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం మొత్తం 15, 700 మంది దరఖాస్తు చేసుకున్నారు.

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు వీరే...

పేరు రంగం రాష్ట్రం

1. శ్రీ ఇళయరాజా కళారంగం తమిళనాడు

2. శ్రీ గులాం ముస్తఫా ఖాన్ కళారంగం మహారాష్ట్ర

3. శ్రీ పరమేశ్వరన్ సాహిత్యం- విద్య కేరళ

పద్మ భూషణ్ అవార్డు గ్రహీతల జాబితా...

పేరు రంగం రాష్ట్రం

4. శ్రీ పంకజ్ అద్వానీ క్రీడారంగం-స్నూకర్ కర్ణాటక

5. శ్రీ ఫిలిపోస్ మార్ క్రిసోస్తమ్ ఆధ్యాత్మికం కేరళ

6. శ్రీ మహేంద్ర సింగ్ ధోనీ క్రీడారంగం- క్రికెట్ జార్ఖండ్

7. శ్రీ అలెగ్జాండర్్ కడాకిన్(విదేశీయుడు) పబ్లిక్ అఫైర్స్ రష్యా

8. శ్రీ రామచంద్రన్ నాగస్వామి ఆర్కియాలజీ తమిళనాడు

9. శ్రీ వేద్ ప్రకాష్ నందా సాహిత్యం-విద్య అమెరికా

10. శ్రీ లక్ష్మణ్ పాయ్ కళలు-చిత్రకళ గోవా

11. శ్రీ అరవింద్ పారిఖ్ కళలు-సంగీతం మహారాష్ట్ర

12. శారద సిన్హా కళలు-సంగీతం బీహార్

పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎవరంటే...

పేరు రంగం రాష్ట్రం

13. శ్రీ అభయ్ భాంగ్ వైద్యరంగం మహారాష్ట్ర

13. రాణి భాంగ్ వైద్యరంగం మహారాష్ట్ర

14. శ్రీ దామోదర్ గణేష్ బాపట్ సోషల్ వర్క్ చత్తీస్‌గఢ్

15. శ్రీ ప్రఫుల్ల గోవింద బారువా జర్నలిజం అసోం

16. శ్రీ మోహన్ స్వరూప్ భాటియా ఆర్ట్-ఫోక్ మ్యూజిక్ ఉత్తరప్రదేశ్

17. శ్రీ సుధాంశు బిస్వాస్ సోషల్ వర్క్ పశ్చిమ బెంగాల్

18. సాయ్‌కోమ్ మీరాబాయి చాను క్రీడలు-వెయిట్ లిఫ్టింగ్ మణిపూర్

19. శ్రీ పండిట్ శ్యామ్‌లాల్ చతుర్వేది జర్నలిజం చత్తీస్‌గఢ్

20.శ్రీ జోస్ మా జోయ్ కాన్సెప్సియన్ III ట్రేడ్ & ఇండస్ట్రీ ఫిలిప్పైన్స్

21. ఎల్.ఎస్.దేవి ఆర్ట్-వీవింగ్ మణిపూర్

22.శ్రీ సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ క్రీడలు-టెన్నిస్ త్రిపుర

23. శ్రీ యెషీ ధోడెన్ వైద్యరంగం హిమాచల్ ప్రదేశ్

24. శ్రీ అరూప్ కుమార్ దత్తా సాహిత్యం-విద్య అసోం

25. శ్రీ దొడ్డారెంగె గౌడ ఆర్ట్-లిరిక్స్ కర్ణాటక

26. శ్రీ అరవింద్ గుప్తా సాహిత్యం-విద్య మహారాష్ట్ర

27. శ్రీ దిగంబర్ హన్స్‌డా సాహిత్యం-విద్య జార్ఖండ్

28. శ్రీ రామ్లీ బిన్ ఇబ్రహీం(విదేశీయుడు) కళలు-నృత్యం మలేసియా

29. శ్రీ అన్వర్ జలాల్‌పూరి సాహిత్యం-విద్య ఉత్తరప్రదేశ్

30. శ్రీ పియోంగ్ తెంజన్ జమీర్ సాహిత్యం-విద్య నాగాలెండ్

31. సీతవ్వ జొడ్డాటి సామాజిక సేవ కర్ణాటక

32. మాలతీ జోషి సాహిత్యం-విద్య మధ్యప్రదేశ్

33. శ్రీ మనోజ్ జోషి కళ-నటన మహారాష్ట్ర

34. శ్రీ రామేశ్వర్‌లాల్ కాబ్రా ట్రేడ్ & ఇండస్ట్రీ మహారాష్ట్ర

35. శ్రీ ప్రాణ్ కిషోర్ కౌల్ కళలు జమ్మూకశ్మీర్

36. శ్రీ బౌన్లాప్ కియోకాంగ్‌నా ఆర్కిటెక్చర్ లావోస్

37. శ్రీ విజయ్ కిచ్లు కళలు-సంగీతం పశ్చిమ బెంగాల్

38. శ్రీ తోమీ కోహ్(విదేశీయుడు) పబ్లిక్ అఫైర్స్ సింగపూర్

39. లక్ష్మీ కుట్టి సంప్రదాయ వైద్యం కేరళ

40. జయ శ్రీ గోస్వామి సాహిత్యం-విద్య అసోం

41. శ్రీ నారాయణ్ దాస్ మహారాజ్ ఆధ్యాత్మికం రాజస్థాన్

42. శ్రీ ప్రవకర మహారాణా కళలు-శిల్పం ఒడిషా

43. శ్రీ హన్ మెనీ(విదేశీయుడు) పబ్లిక్ అఫైర్స్ కాంబోడియా

44. నౌఫ్ మర్వాయి యోగ సౌదీ అరేబియా

45. శ్రీ జవేరీలాల్ మెహతా జర్నలిజం గుజరాత్

46. శ్రీ కృష్ణ బిహారీ మిశ్రా సాహిత్యం-విద్య పశ్చిమ బెంగాల్

47. శ్రీ శిశిర్ పురుషోత్తమ్ మిశ్రా కళలు-సినిమా మహారాష్ట్ర

48. సుభాషిణి మిస్త్రీ సామాజిక సేవ పశ్చిమ బెంగాల్

49. శ్రీ తొమియో మిజోకమీ సాహిత్యం-విద్య జపాన్

50. శ్రీ సోమ్‌దెత్ ప్రమహా మునివాంగ్ ఆధ్యాత్మికం థాయిలాండ్

51. శ్రీ కేశవ్ రావు ముసల్గోంకర్ సాహిత్యం-విద్య మధ్యప్రదేశ్

52. డాక్టర్ థాంట్ మింట్ యు పబ్లిక్ అఫైర్స్ మయన్మార్

53. వి.నానమ్మాళ్ యోగ తమిళనాడు

54. సులగిట్టి నరసమ్మ సోషల్ వర్క్ కర్ణాటక

55. విజయలక్ష్మి నవనీతకృష్ణన్ ఆర్ట్-ఫోక్ మ్యూజిక్ తమిళనాడు

56. శ్రీ నియోమన్ న్యూర్తా కళలు-శిల్పం ఇండోనేషియా

57. శ్రీ మలాయ్ హాజీ అబ్దుల్లా సోషల్ వర్క్ బ్రూనై

బిన్ మలాయ్ హాజీ ఓత్‌మాన్ దారుస్సలాం

58. శ్రీ గోబర్దన్ పానిక ఆర్ట్-వీవింగ్ ఒడిషా

59. శ్రీ భవాని చరణ్ పట్నాయక్ పబ్లిక్ అఫైర్స్ ఒడిషా

60. శ్రీ మురళీకాంత్ పేట్కర్ క్రీడలు-ఈత మహారాష్ట్ర

61. శ్రీ హబీబుల్లా రాజ్‌భోవ్ సాహిత్యం-విద్య తజకిస్థాన్

62 శ్రీ ఎం.ఆర్.రాజగోపాల్ మెడిసిన్-పల్లియేటివ్ కేర్ కేరళ

63. శ్రీ సంపత్ రామ్‌టేకే సోషల్ వర్క్ మహారాష్ట్ర

64. శ్రీ చంద్రశేఖర్ రాత్ సాహిత్యం-విద్య ఒడిషా

65. శ్రీ ఎస్ఎస్ రాథోడ్ సివిల్ సర్వీస్ గుజరాత్

66. శ్రీ అమితవ రాయ్ సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్

67. శ్రీ సాందుక్ రుయిత్ మెడిసిన్-ఆప్తామాలజీ నేపాల్

68. శ్రీ ఆర్ సత్యనారాయణ కళలు-సంగీతం కర్ణాటక

69. శ్రీ పంకజ్ ఎం షా మెడిసిన్-ఆంకాలజీ గుజరాత్

70. శ్రీ బజ్జూ శ్యామ్ ఆర్ట్-పెయింటింగ్ మధ్యప్రదేశ్

71. శ్రీ మహారావ్ రఘువీర్ సింగ్ సాహిత్యం-విద్య రాజస్థాన్

72. శ్రీ కిదాంబి శ్రీకాంత్ క్రీడలు-బ్యాడ్మింటన్ ఆంధ్రప్రదేశ్

73. శ్రీ ఇబ్రహీం సుతార్ కళలు-సంగీతం కర్ణాటక

74. శ్రీ సిద్ధేశ్వర స్వామీజీ ఆధ్యాత్మికం కర్ణాటక

75. లెంటినా ఓ థక్కర్ సోషల్ వర్క్ నాగాలాండ్

76. శ్రీ విక్రమ్ చంద్ర ఠాకూర్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తరాఖండ్

77. శ్రీ రుద్రపట్నం నారాయణస్వామి కళలు-సంగీతం కర్ణాటక

తారానాథన్

శ్రీ రుద్రపట్నం నారాయణస్వామి కళలు-సంగీతం కర్ణాటక

త్యాగరాజన్

78. శ్రీ నుంజెన్ టియాన్ తియాన్ ఆధ్యాత్మికం వియత్నాం

79. శ్రీ భగీరథ్ ప్రసాద్ త్రిపాఠీ సాహిత్యం-విద్య ఉత్తరప్రదేశ్

80. శ్రీ రాజగోపాలన్ వాసుదేవన్ సైన్స్ & ఇంజనీరింగ్ తమిళనాడు

81. శ్రీ మానస్ బిహారీ వర్మ సైన్స్ & ఇంజనీరింగ్ బీహార్

82. శ్రీ పంటవానే గంగాధర్ విటోబాజీ సాహిత్యం-విద్య మహారాష్ట్ర

83. శ్రీ రోములస్ విటాకర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ తమిళనాడు

84. శ్రీ బాబా యోగేంద్ర కళలు మధ్యప్రదేశ్

85. శ్రీ ఎ.జకియా సాహిత్యం-విద్య మిజోరాం

ఇళయరాజా సహా ముగ్గురికి... 
ఇళయరాజా సహా ముగ్గురికి పద్మవిభూషణ్...
కళారంగానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, గులాం ముస్తఫా ఖాన్‌తో పాటు సాహిత్యం, విద్యారంగానికి చెందిన పరమేశ్వరన్‌ (కేరళ)ను కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. కేంద్రం తనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిందని తెలియగానే ఇళయరాజా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రకటించిన ఈ అవార్డు మొత్తం దక్షిణ భారతానికే వచ్చినట్లుగా తాను భావిస్తున్నానని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com