పద్మావత్ సినిమాపై రాష్ట్రపతి వ్యాఖ్యలు

- January 26, 2018 , by Maagulf
పద్మావత్ సినిమాపై రాష్ట్రపతి వ్యాఖ్యలు

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రిపబ్లిక్ డే ప్రసంగంలో విలువలతో కూడిన అభివృద్ధిని ఆకాంక్షించారు. పొరుగువారి అభిప్రాయాలకూ, హక్కులకూ, వ్యక్తిగత గోప్యతకూ విలువివ్వాలని కోరారు. పండుగలు చేసుకున్నా, నిరసనలు చేపట్టినా ఇతరులకు అసౌకర్యం కల్గించరాదంటూ పద్మావత్ సినిమా నిరసనలపై పరోక్షంగా కామెంట్ చేశారు. విభేదాలను హుందాగా వ్యక్తపరచాలన్నారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దళిత రాష్ట్రపతుల్లో రెండోవారైన రామ్ నాథ్ కోవింద్ తొలి రిపబ్లిక్‌ డే ప్రసంగమిది. సుప్రీంకోర్టు వివాదాన్ని కూడా రాష్ట్రపతి పరోక్షంగా ప్రస్తావించారు.

వ్యక్తుల కన్నా వ్యవస్థ పెద్దది.. తాము పనిచేసే వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టేట్లు అందులో పనిచేసేవారు కృషి చేయాలని కోరారు. 21 వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ ఆర్థికవ్యవస్థను, ఆటోమేషన్‌, రోబోటిక్స్‌, జినోమిక్స్‌.. మొదలైనవాటి సాకారం కోసం కదలాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన అతివేగంగా జరగాలని ఆకాంక్షించారు.

ఇందుకోసం లాభాలు, అధికారాలు వదులుకొని దాతృత్వ స్ఫూర్తిని అవలంభించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com