ఎమిరేట్స్ విమానంలో తోటి ప్రయాణికులను కంగారు పెట్టిన నైజీరియా ప్రయాణికుడు

- January 27, 2018 , by Maagulf
ఎమిరేట్స్ విమానంలో తోటి ప్రయాణికులను కంగారు పెట్టిన నైజీరియా  ప్రయాణికుడు

దుబాయ్:  గాల్లోనికి విమానం ఎగరడమే కొందరికి రక్తపోటు పెరగడం సహజం...కానీ ఓ నైజీరియాకు చెందిన వ్యక్తి నానా యాగీ చేశాడు...తోటి ప్రయాణికులకు పట్టపగలే విమానంలో చుక్కలు చూపించాడు. ఇటీవల   దుబాయ్ నగరం నుంచి చికాగో బయలుదేరిన ఎమిరేట్స్ విమానంలో 64 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో అపరిచితుడిగా మారిపోయాడు. వింత చేష్టలతో విమానమంతా కలియ తిరిగేడు. పిచ్చిపట్టిన వ్యక్తిలా బిగ్గరగా అరుస్తూ విమాన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఎవరి మాటా లెక్కచేయలేదు. అతికష్టం మీద ప్రయాణికుడిని అదుపు చేసిన సిబ్బంది విమానం చికాగో చేరుకోగానే పోలీసు అధికారులకు ఆ వ్యక్తిని అప్పగించారు. బుధవారం తెల్లవారుజామున విమానంలో ఆ వ్యక్తి చేసిన హడావిడి అంతా వివరించారు. దీంతో ఆరోగ్య పరిస్థితుల దృష్టా హాస్పిటల్‌కు తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com