అంగరంగ వైభవంగా 'రెహ్మాన్' కాన్సెర్ట్
- January 27, 2018దుబాయ్:జనవరి 26న సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ కాన్సెర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ పార్క్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆహూతులు అత్యద్భుతంగా ఎంజాయ్ చేశారు. రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్‌కి తోడు, అర్మాన్ మాలిక్, నీతి మోహన్, బెన్నీ దయాల్, జోనితా గాంధీ, హరిచరణ్ శేషాద్రి, హర్షదీప్ కౌర్, జావెద్ అలీ ఈ కార్యక్రమానికి విచ్చేసినవారిని అలరించారు, తమ పాటలతో సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. కనీ వినీ ఎరుగని రీతిలో తీర్చిదిద్దిన స్టేజ్, మిరుమిట్లు గొలిపే దీప కాంతులు, ఒకటేమిటి రెహమాన్ కాన్సెర్ట్ నభూతో నభవిష్యతి అనే రేంజ్‌లో జరిగింది. 'కాదల్ దేశం'లోని 'ముస్తఫా ముస్తఫా' సాంగ్‌కి ఆడియన్స్ సైతం పదం, పాదం రెండూ కలిపేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఈ ప్రోగ్రామ్ అత్యద్బుతంగా సాగింది. ఎముకలు కొరికే చలిని, మంచునీ ఎవరూ లెక్క చేయలేదు. ఓ పక్క హీటెక్కించే పెర్ఫామెన్స్‌లు, ఇంకోపక్క చలి రెండూ బ్యాలెన్స్ అయిపోయాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి