బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 టి 20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

- January 28, 2018 , by Maagulf
బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018  టి 20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

మనామ : గల్ఫ్ లో క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్న టి 20 క్రికెట్ టోర్నీ షెడ్యూల్ రానే వచ్చింది. బహ్రెయిన్ లో మొట్టమొదటి ఫ్రాంచైజ్ ఆధారిత టి 20 క్రికెట్ టోర్నమెంట్ ఇసా టౌన్ లో గౌరవనీయ శ్రీ షేక్ ఖాలిద్ బిన్ హమద్ అల్ ఖలీఫా యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో ఎగ్జిలోన్ కలిసి మహమ్మద్ షాహిద్ నేతృత్వంలోని కె హెచ్ కె స్పోర్ట్స్ కొనసాగనుంది. బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ అధ్యక్షుడు మహమ్మద్ మన్సూర్ ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ప్రారంభించారు. బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ మొట్టమొదటి ఎడిషన్ టి 20 క్రికెట్ టోర్నమెంట్ లో ఆరు క్రికెట్ జట్లు పోటీ పడతాయి. అవి ఇన్టక్స్ లయన్స్, సారమ్రమ్ ఫాల్కన్స్, బహ్రెయిన్ సూపర్జియాట్స్, బహ్రెయిన్ నైట్ రైడర్స్, అవాన్ వారియర్స్ మరియు ఫోర్ స్కయర్ ఛాలెంజర్స్ ఉన్నాయి. బహ్రెయిన్ లో క్రికెట్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వివిధ ప్రవాసియ సమాజంలో స్నేహం ఐక్యతలు పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ దోహదపడతుంది. క్రికెట్ క్రీడ సైతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని రాబట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. క్రికెట్ నేపథ్యంలో మీడియా టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు కలగడమే కాక ప్రపంచ దృష్టిని బహ్రెయిన్ దేశం ఆకర్షిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com