పశుమార్కెట్ పై పాస్ పోర్ట్ పోలీసుల ఆకస్మిక తనిఖీ 130 మంది అక్రమవాసుల అరెస్ట్

- January 28, 2018 , by Maagulf
పశుమార్కెట్ పై  పాస్ పోర్ట్ పోలీసుల ఆకస్మిక తనిఖీ 130 మంది అక్రమవాసుల అరెస్ట్

జెడ్డా :  పాస్ పోర్ట్ పోలీసులు శనివారం జెడ్డా కేంద్ర పశువుల మార్కెట్ పై  ఆకస్మిక తనిఖీ జరిపి130 మంది అక్రమవాసుల అరెస్ట్ చేశారు. నివాస మరియు కార్మిక నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నివాసితులు లేని దేశంగా రూపందించేందుకు జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ చర్య నిర్వహించారు. ఈ దాడిలో  ట్రాఫిక్ పోలీస్, రెడ్ క్రెసెంట్, ముజాహిదీన్ ప్రత్యేక దళాలు, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, జెడ్డా మునిసిపాలిటీలు పాల్గొన్నారు. ఈ సమన్వయ ప్రచారం నగరంలో పశువులు, గొర్రెలు లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా విక్రయించబడుతున్నాయినే అంశంను సైతం గుర్తించారు. గత ఏడాది నవంబరు 15 వ తేదీన  ప్రారంభమైన చట్టవిరుద్ధ విదేశీ నివాసులకు వ్యతిరేకంగా మొదలైన తనిఖీ కార్యక్రమంలో ఇప్పటివరకు  480,919 మంది ప్రజలు అరెస్టు చేశారు. నివాసితులు, శ్రామికులు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిలో 109,662 మంది ఇప్పటికే తమ తమ దేశాలకు పంపించబడ్డారు. 7,147 మంది ప్రజలు తమ దక్షిణ సరిహద్దుల నుండి  రాజ్యంలోకి చొరబడేందుకు ప్రయత్నం చేశారని భద్రతా దళాలు  చెప్పారు.  74 శాతం మంది దేశంలోకి బలవంతాన చొరబడవారని తెలిపారు. ఇందులో  24 శాతం మంది ఇథియోపియన్లు, మిగిలిన 2 శాతం మంది వివిధ దేశాలకు చెందిన ప్రజలని వివరించారు. 972 మంది అక్రమ వలసదారులలో 151 మంది సౌదీలతో సహా పట్టుబడ్డారని వారందరికీ  రవాణా మరియు వసతి కల్పించిన అనంతరం139 సౌదీలను ప్రశ్నించారు..వారికి జరిమానా సైతం విధించారు, మొత్తం ఉల్లంఘనదారులలో   11,796 మందిలో 12 మంది ఇప్పటికీ విచారణలో ఉన్నారు. మొత్తం 9,764 మంది పురుషులు, 2,032 మంది మహిళలు ఉన్నారు. వీరంతా దేశంలోని నిర్బంధ కేంద్రాల్లో ఉంటున్నారు.  83,093 మందికి  జరిమానా విధించారు, 71,749 మందికి వారి వారి సంబంధిత రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్లను ప్రయాణ పత్రాలను జారీ చేయాలని సూచించారు. 77,300 మందికి దేశం నుంచి పంపించేందుకు ప్రయాణ ఏర్పాట్లను పూర్తి చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com