విజయ్ 'న్యూ లుక్' లీక్ : గెటప్ అదిరింది!.. మళ్లీ 'పాలిటిక్స్' తో మూవీ నా

- January 29, 2018 , by Maagulf
విజయ్ 'న్యూ లుక్' లీక్ : గెటప్ అదిరింది!.. మళ్లీ 'పాలిటిక్స్' తో మూవీ నా


తమిళనాట స్టార్ హీరో విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పెద్ద పండుగే. మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడాయన దర్శకుడు మురుగాదాస్ తో సినిమా చేయబోతున్నారు. విజయ్ నటిస్తున్న 62వ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో విజయ్ లుక్ కు సంబంధించి తాజాగా ఓ లీక్ రావడం గమనార్హం.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న సినిమాలో.. ఆయన లుక్ ఇలాగే ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది. ఇందులో విజయ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. లైట్ గడ్డంతో, టీషర్ట్ ధరించి కనిపిస్తున్న ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.గతేడాది డిసెంబర్ లోనూ విజయ్ ఫోటోషూట్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. మురుగదాస్ తో సినిమా నేపథ్యంలో ఈ ఫోటోషూట్ జరపగా.. అవికాస్త సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. బ్లేజర్ ధరించి, చేతిలో పిస్టల్ పట్టుకుని ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.తాజాగా లీకైన ఫోటో కూడా షూటింగ్ సెట్స్ నుంచే లీకైనట్లుగా భావిస్తున్నారు. ఓ పాట చిత్రీకరణలో భాగంగా చేసిన ఫోటోషూట్‌ నుంచే ఈ ఫోటో లీకైందన్న ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా కొత్త గెటప్స్‌లో కనిపించడానికి ఆసక్తి కనబరుస్తున్న విజయ్.. తాజాగా లీకైన ఫోటోలో కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు.
ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న శ్రీకర్ ప్రసాద్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కథ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ స్ట్రాంగ్ మెసేజ్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. మురుగదాస్ సినిమాలో ఏయే ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఉంటాయని, వాటితో పాటు కొత్తదనం ఉట్టిపడేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు.
ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది రెండో చిత్రం కావడం విశేషం. గతంలో 'భైరవ' చిత్రంలో కలిసి చేశారు. సినిమాకు గిరీష్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి తోడు మెర్సల్ సినిమాలో జీఎస్టీపై ఉన్న కొన్ని డైలాగ్స్ దేశ రాజకీయాలను కూడా కుదిపేయడంతో.. విజయ్ తదుపరి సినిమాలోనూ రాజకీయాలను టార్గెట్ చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా సామాజిక అంశాలను టచ్ చేస్తూ సినిమా తీసే మురుగదాస్.. ఈ సినిమాతో ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారనేది కూడా ఆసక్తికరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com