సౌదీ మార్గంలోనే ఉత్తరప్రదేశ్

- January 29, 2018 , by Maagulf
సౌదీ మార్గంలోనే ఉత్తరప్రదేశ్

లక్నో: ఉత్తర ప్రదేశ్‌కి చెందిన దేవ్‌బంధ్ సంస్థ ముస్లిం మహిళల్లో క్రమశిక్షణ అలవర్చడమనే నెపంతో మరో ఫత్వాను జారీ చేసింది. ఇందులో భాగంగా ముస్లిం మహిళలు ఫుట్‌బాల్ ఆటను చూడటంపై నిషేధం విధించింది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు మోకాళ్ల వరకు దుస్తులు ధరించడం కారణంగా వారికి ముస్లిం మహిళలు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలు మగ వాళ్లను ఆ విధంగా చూడటం ముస్లిం చట్టాల ప్రకారం పాపం అని దేవ్‌బంధ్ ప్రతినిధి ముఫ్తీ అతర్ కస్మీ అన్నారు.

2015లో సౌదీ అరేబియాలో జారీ చేసిన ఫత్వా ఆధారంగా ఈ కొత్త ఫత్వాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఫుట్‌బాల్ ఆటలో స్కోర్లు, ఆనందం కోసం కాకుండా ఆటగాళ్ల కాళ్లను, తొడలను చూడటానికే ముస్లిం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని అప్పట్లో షేక్ సాద్ అల్ హజారీ ఫత్వా జారీ చేశారు. అలాగే భార్యలను ఫుట్‌బాల్ ఆట చూసేందుకు అనుమతిస్తున్న భర్తలకు కూడా ఆ ఫత్వాలో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అదే ఫత్వా మార్గదర్శకాలను దేవ్‌బంధ్ సంస్థ కూడా అనుసరించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com