జెడ్డా పవర్ స్టేషన్ వద్ద మంటలు...పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

- January 29, 2018 , by Maagulf
జెడ్డా పవర్ స్టేషన్ వద్ద మంటలు...పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

జెడ్డా : ఉత్తర జెడ్డాలో విద్యుత్ ట్రాన్స్మిషన్ స్టేషన్ వద్ద మంటలు ఎగిసిపడటంతో సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై మక్కా ప్రాంతంలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి సయీద్ అల్-సరాన్ మాట్లాడుతూ, అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాద స్థలానికి తరలించగా, విద్యుత్ పవర్ ట్రాన్స్మిషన్ స్టేషన్ లోని మంటలను నియంత్రించారన్నారు. తమ శాఖకు ఉదయం 7:36 సమయంలో అగ్ని ప్రమాదం గూర్చి సమాచారం అందిందన్నారు. విద్యుత్ ట్రాన్స్మిషన్ స్టేషన్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం కారణంగా జెడ్డా నగరంలోని ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, వీటిలో అల్-షాటీ, అల్-నహదాహ్, అల్-నయీమ్, ముహమ్మదియా, అల్-నూజా, అల్-మర్వా, అల్-హరమైన్ రహదారి, మరియు దక్షిణ ఓబ్హూర్.ఇది కూడా ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల ఎలివేటర్లను నిలిచిపోయాయి . సివిల్ డిఫెన్స్ బృందాలు విపత్తు నివారణ జట్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడకు వెంటనే తరలించారు. కాగా సివిల్ డిఫెన్స్ అధికారులు విద్యుత్ పవర్ ట్రాన్స్మిషన్ స్టేషన్ వద్ద  అగ్నిప్రమాదం జరగడానికి  దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ ప్రారంభించారు. విద్యుత్ సేవలలో కల్గిన అంతరాయంపై  వినియోగదారులందరికి సౌదీ ఎలక్ట్రిసిటీ కో. క్షమాపణ చెప్పింది. సోమవారం ఉదయం విద్యుత్ నెట్వర్క్ లో ఏర్పడిన సాంకేతిక వైఫల్యం కారణంగా విద్యుత్ నిలిచిపోయింది. 20 నిమిషాల వ్యవధిలో విద్యుత్ ను పునరుద్ధరించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com