సమంత చరణ్ ల డ్యూయెట్ క్యాన్సిల్కు కారణం

- January 29, 2018 , by Maagulf
సమంత చరణ్ ల డ్యూయెట్ క్యాన్సిల్కు కారణం

రంగస్థలం' టీజర్ వచ్చాక వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాక సినిమా ఎలా ఉంటుందో అని భయపడ్డ చరణ్ అభిమానుల భయాలు పూర్తిగా తొలిగిపోయాయి. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో ఈసినిమాలోని పాత్రల పరిచయం పేరుతో చిన్నచిన్న బిట్ టీజర్లు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట సుకుమార్.ప్రస్తుతం చివరి దశలో ఉన్న 'రంగస్థలం' షూటింగ్ లో లీడ్ యాక్టర్స్ లో రామ్ చరణ్ అనసూయ మాత్రమే పాల్గొంటున్నారని తెలుస్తోంది. సమంత ఇప్పుడున్న షెడ్యూల్ లో లేదు అని సమాచారం. అయితే సుకుమార్ చరణ్ సమంత లతో కొత్త తరహాలో ఒక రొమాంటిక్ సాంగ్ తీయాలని భావించి ఆపాటకు సంబంధించిన ట్యూన్ ను కూడ ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ చేత ట్యూన్ చేయించినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పుడు ఆ రొమాంటిక్ పాట చిత్రీకరణ ఆలోచనను క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సమంత అని అంటున్నారు. అక్కినేని కోడలుగా సమంత మారిన తరువాత ఆమె తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఎటువంటి ఎక్స్ పోజింగ్ సీన్స్ ను అంగీకరించడం లేదని టాక్. దీనితో సమంత సున్నితంగా ఈ రొమాంటిక్ సాంగ్ కు నో చెప్పింది అని అంటున్నారు.అయితే సమంత ఇలా నిర్ణయం తీసుకోవడం వెనుక వేరే కారణం ఉంది అని మరికొందరంటున్నారు. ప్రస్తుతం సమంత తన డేట్స్ అన్నీ 'మహానటి' సినిమాకు ఇచ్చేయడంతో ఆమెకు వేరే మార్గం లేక సుకుమార్ కు ఇలా నో చెప్పింది అని మరికొందరి అభిప్రాయం. ఈసినిమా విడుదలకు సంబంధించి ఇక కేవలం 60 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆఖరి రోజులలో ఎటువంటి హడావిడి ఉండకూడదని సుకుమార్ టీమ్ ప్రస్తుతం ఈసినిమాకు సబంధించి టీం డే అండ్ నైట్ వర్క్ చేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com