ఇండియన్ 2 లో నయనతార
- January 29, 2018
చెన్నై, న్యూస్‌టుడే: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా '2.ఓ'ను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ సినిమాకు సంబంధించిన చివరిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా కమల్‌హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన 'ఇండియన్' (భారతీయుడు) చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్రానికి సంబంధించి భారీ బెలూన్లను కూడా గాల్లోకి ఎగురవేశారు. దిల్‌రాజు నిర్మించనున్నట్లు ఆరంభంలో చెప్పారు. కానీ ఈ సినిమా లైకా సంస్థ చేతికి వెళ్లినట్లు సమాచారం. కమల్ నటించిన సినిమాల్లోనే ఈ చిత్రానికే భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కథానాయికగా నయనతార వద్ద చర్చలు జరుపుతున్నారు. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు వినికిడి. త్వరలోనే ప్రకటించనున్నారు. మొత్తానికి నయనతార ఒప్పుకుంటే..
కమల్, నయనతార కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. 'ఇండియన్'లో సుకన్య తరహాలో ఇందులో నయనతార విప్లవ పాత్ర పోషించనున్నట్లు కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వడివేలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







