డ్రైవింగ్‌ టెస్ట్‌: 41,000 మంది ఫెయిల్‌

- January 30, 2018 , by Maagulf
డ్రైవింగ్‌ టెస్ట్‌: 41,000 మంది ఫెయిల్‌

మనామా: బహ్రెయిన్‌లో గత ఏడాది 41 మంది వేలకు పైగా ట్రైనీస్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో న్యూ వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ 42,000 మార్క్‌ని టచ్‌ చేసింది. డ్రైవింగ్‌ టెస్ట్‌లో పాసింగ్‌ పర్సంటేజ్‌ 62.2గా నమోదయ్యింది 2017 సంవత్సరానికిగాను. 115,943 ట్రైనీలలో కేవలం 74,518 మంది మాత్రమే డ్రైవింగ్‌ టెస్ట్‌ పాస్‌ అయ్యారని ట్రాఫిక్‌ జనరల్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ షేక్‌ అబ్దుల్‌రహ్మాన్‌ బిన్‌ అబ్దుల్‌వాహబ్‌ అల్‌ ఖలీఫా చెప్పారు. డ్రైవింగ్‌ స్కూల్స్‌ ఈ కాలంలో 53,575 లెర్నింగ్‌ లైసెన్సుల్ని జారీ చేశాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్‌ అప్లికేషన్‌, ఇ-గవర్నమెంట్‌ పోర్టల్‌ ద్వారా 1.5మిలియన్‌ అప్లికేషన్లను ప్రాసెస్‌ చేశారు. 2016లో ఈ సంఖ్య 52,000. ట్రాఫిక్‌ హాట్‌లైన్‌ 199, 126,000 కాల్స్‌ని అందుకుంది. ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ 514 అవేర్‌నెస్‌ క్యాంపెయిన్స్‌ని నిర్వహించింది. ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ సహకారంతో ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ ప్రాజెక్ట్‌ నిర్వహించగా, 45,000 మంది లబ్ది పొందారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com