బాలీవుడ్ 'కాంచన 2'లో హీరో అక్షయ్ కుమార్‌

- January 30, 2018 , by Maagulf
బాలీవుడ్ 'కాంచన 2'లో హీరో అక్షయ్ కుమార్‌

తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన లారెన్స్ ఆ తర్వాత హీరో, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన లారెన్స్ 'స్టైల్' చిత్రంతో దర్శకుడిగా ప్రభుదేవతో షభాస్ అనిపించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవ కూడా హీరో, దర్శకుడిగా మారారు. లారెన్స్ హీరోగా 'ముని' సినిమాతో హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో వచ్చారు..ఈ సినిమా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.అంతే ఇదే కాన్సెప్ట్ తో కాంచన, గంగ చిత్రాలతో మరింత దగ్గర అయ్యారు. ప్రస్తుతం ముని 3 చిత్రానికి ప్రిపేర్ అవుతున్నారు లారెన్స్. ఇదిలా ఉంటే..2015లో వచ్చిన 'కాంచన 2' చిత్రాన్ని త్వరలో బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు సమాచారం. 'కాంచన' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో 'గంగ' పేరుతో విడుదలైంది. ఇందులో రాఘవ లారెన్స్‌, తాప్సీ, నిత్యామీనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా తెలుగు, తమిళంతో కలిపి దాదాపు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టడంతో 'కాంచన 3' సినిమాను కూడా తెరకెక్కించే పనిలో పడ్డారు లారెన్స్‌. ఇందులో తమిళ బిగ్‌బాస్ ఫేం ఓవియా హెలెన్ నటిస్తోంది. అయితే బాలీవుడ్ లో 'కాంచన 2' రీమేక్ ని క్రిఅర్జ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రేరణా అరోరా, అర్జున్‌ కపూర్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.సెప్టెంబర్‌లో సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి, 2019లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు అక్షయ్ కుమార్‌ నటించిన 'ప్యాడ్‌మ్యాన్‌' చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంచన చిత్రాన్ని కన్నడలో ఉపేంద్ర నటించారు. ఇప్పుడు కాంచన 2 చిత్రంలో అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com