టర్కీ సేనలు విమానాన్ని కూల్చివేశార?
- November 24, 2015
టర్కీ సేనలు సిరియా సరిహద్దులో ఓ సైనిక విమానాన్ని కూల్చివేశాయి. స్థానిక మీడియా సైతం సిరియా సరిహద్దులో సైనిక విమానం కూలిపోయిందని స్పష్టం చేసింది. ఈ మేరకు కథనం ప్రసారం చేసింది. మంగళవారం సిరియా సరిహద్దు మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపంలోకి రాగానే టర్కీ సేనలు ఆ విమానాన్ని కూల్చివేశారు. ఆ విమానం శిథిలాలు పర్వతం మీదపడ్డాయని టర్కీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అయితే ఆ విమానం ఏ దేశానికి చెందినది అనే విషయం మాత్రం తెలియడం లేదని టర్కీ అధికారులు అంటున్నారు. ఆ విమానం వివరాలు తెలుసుకునేందుకు టర్కీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఫ్రాన్స్ సైనిక విమానం పొరపాటున టర్కీ వైపు వచ్చిందా అని ఆరా తీస్తున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







