అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్ ప్రసంగం: టెక్కీ సునయనకు ఇన్విటేషన్
- January 30, 2018
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుదవారం నాడు అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గత ఏడాది జాతి విద్వేష కాల్పుల్లో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ సతీమణి సునయనకు ఆహ్వనం అందింది.
గత ఏడాది అమెరికాలోని కేన్సస్‌లోని రెస్టారెంట్లో జరిగిన జాతి విద్వేష కాల్పుల్లో ఇండియాకు చెందిన టెక్కీ కూచిబొట్ల శ్రీనివాస్ మరణించాడు. ఆయన స్నేహితుడు ఈ ప్రమాదం నుండి తప్పించుకొన్నాడు.
ఈ కాల్పులు జరిపిన దుండగుడిని ప్రతిఘటించిన మరో అమెరికన్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆ తర్వాత కోలుకొన్నాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అమెరికా ప్రభుత్వం. దీంతో నష్టనివారణ చర్యలను తీసుకొంది.
1 ట్రంప్ ప్రసంగానికి సునయనకు ఆహ్వనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుదవారం నాడు అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ ప్రసంగానికి ఇండియాకు చెందిన సునయనకు ఆహ్వనం అందింది. గత ఏడాది కేన్సన్‌లో జరిగిన జాతి విద్వేష కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ మరణించాడు. శ్రీనివాస్ భార్యే సునయన. దేశవ్యాప్తంగా పలువురు అతిథులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయనను కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ ఆహ్వానించారు. శ్రీనివాస్‌ను గత ఏడాది ఓలేథ్ ఒక బారులో ఆడమ్ ప్యూరింటన్ అనే వ్యక్తి జాతి విద్వేషంతో కాల్చి చంపాడు.
2 శాంతికి గుర్తుగా సునయనకు ఆహ్వనం
శాంతిని పెంపొందించడానికి అవిశ్రాంతంగా చేసిన కృషికి గుర్తింపుగా సునయనను నా ఆతిథిగా ఆహ్వానించినట్టు కెవిన్ యోడర్ చెప్పారు.. అమెరికాలో వలసదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తేల్చి చెప్పేందుకు సునయనను ఆహ్వనించినట్టు ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయులను అమెరికాకు స్వాగతిస్తామని చెప్పేందుకే సునయకు ఆహ్వనించినట్టు యోడర్ చెప్పారు.
3 స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్‌గా పేరు
అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసే ప్రసంగాన్ని స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్‌గా పేర్కొంటారు. దేశంలో నెలకొన్న తాజా స్థితిగతులను ఆయన ఇందులో వివరిస్తుంటారు. వాణిజ్యం, వలసల గురించి ప్రసంగిస్తానని ట్రంప్ ప్రకటించారు. సురక్షితమైన, బలమైన, గర్వకారణమైన అమెరికా నిర్మాణమే ఈ ప్రసంగ ఇతివృత్తమని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి శారా శాండర్స్ చెప్పారు.
4 తాలిబన్లతో చర్చలుండవు
తాలిబన్లతో చర్చలుండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వారిని అంతమొందిస్తామని స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు వరుస దాడులతో 130 మందిని బలి తీసుకున్న నేపథ్యంలోఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రాయబారులతో ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. . తాలిబన్లపై గట్టి సైనిక చర్య ఉంటుందని ఈ సందర్భంగా ట్రంప్ సంకేతాలిచ్చారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి