సందీప్ రెడ్డి డైరెక్షన్ లో మహేష్ బాబు!
- January 30, 2018
ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమాలు చేయాలని టాప్ డైరెక్టర్స్ అంతా ఉత్సాహ పడుతూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే మహేష్ కూడ తన కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ టాప్ డైరెక్టర్స్ తోనే ఎక్కువగా చేసాడు. కొత్త దర్శకులను మహేష్ ప్రోత్సహించిన సందర్భాలు చాల తక్కువ.అయితే అలా పెద్ద అనుకున్న దర్శకులే మహేష్ కు గత కొన్నేళ్లలో దారుణమైన ఫలితాలనందించారు. 'శ్రీమంతుడు' మినహా గత నాలుగేళ్లలో మహేష్ నటించిన నాలుగు సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మిగిలిన విషయం తెలిసిందే. కనీసం మురగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా మహేష్ ను పరాజయాల నుంచి కాపాడలేక పోయాడు.ఇలాంటి పరిస్థుతులలో 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి చెప్పిన కథకు మహేష్ అంగీకరించాడు అన్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరిచాయి. దీనితో మహేష్ కూడ తన పద్ధతిని మార్చుకుని కొత్త దర్శకుల వైపు చూస్తున్నాడా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈమధ్యనే సందీప్ రెడ్డి మహేష్ ల మధ్య జరిగిన సమావేశంలో 'షుగర్ ఫ్యాక్టరీ' ప్రస్తావన వచ్చినట్లు టాక్.వాస్తవానికి ఈ షుగర్ ఫ్యాక్టరీ టైటిల్ తో సందీప్ రెడ్డి తయారుచేసిన కథను 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత మళ్ళీ విజయ్ దేవర కొండ తోనే కొంత గ్యాప్ తీసుకుని తీయాలి అని అనుకున్నాడట. అయితే ఆ కథకు అన్నివిధాల మహేష్ సరిపోతాడు అని సందీప్ రెడ్డితో పాటు మహేష్ కూడ భావించడంతో ఇప్పుడు ఈ 'షుగర్ ఫ్యాక్టరీ' స్క్రిప్ట్ రచన పరుగులు పెడుతోంది అని అంటున్నారు. ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు నిలబెట్టాలి అని భావిస్తున్న మహేష్ ఆలోచనలకు సందీప్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి..
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు