డాక్టర్ గా అవతారం ఎత్తిన రాజమౌళి

- January 30, 2018 , by Maagulf
డాక్టర్ గా అవతారం ఎత్తిన రాజమౌళి

'బాహుబలి' సీరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. త్వరలో ఓ మల్టీస్టారర్ మూవీని పట్టాలెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ సినిమా కోసం రాజమౌళి డాక్టర్ అవతారమెత్తనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. రాజమౌళి శిష్యుడు, 'ద్రోణ' (2009) చిత్ర దర్శకుడు కరుణ కుమార్ నూతన నటీనటులతో ఓ సినిమాని తెరకెక్కించనున్నాడు. సుకుమార్ శిష్యుడు, 'దర్శకుడు' మూవీ డైరెక్టర్ హరి ప్రసాద్ ఈ సినిమాకి కథ, మాటలు అందించనున్నాడు. ఈ చిత్రంలో కథకి కీలకమైన ఓ డాక్టర్ పాత్ర ఉందని.. దానికి రాజమౌళి అయితేనే బావుంటుందని కరుణ కుమార్ ఆయన్ని సంప్రదించగా.. పాత్ర నచ్చడంతో రాజమౌళి కూడా ఓకే చెప్పారట. ఇదివరకు కూడా రాజమౌళి కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com