దుబాయ్:గంటకు 200 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్ సూపర్ కార్
- January 31, 2018
దుబాయ్:దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్, అత్యంత వేగంతో ప్రయాణించే అంబులెన్స్ కారుని ప్రారంభించింది. ఈ కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, అవసరమైన చోటకి వీలైనంత తక్కువ సమయంలో చేరుకుని, ఆపదలో ఉన్నవారికి సాయపడుతుంది. దుబాయ్ అంబులెన్స్ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ, న్యూ స్పోర్ట్స్ కార్గత నెలలో ప్రారంభించామనీ, ఆన్ మరియు ఆఫ్ రోడ్లో ఇది ఉపయోగిస్తామని చెప్పారు. అరబ్ హెల్త్ వద్ద డిస్ప్లే కోసం ఉంచినా, ఇది సిటీ వాక్ వద్ద స్టేషన్ చేయబడి ఉంటుంది. అవసరాన్ని బట్టి ఇలాంటి కార్లను ఇంకా పెంచేందుకు ప్రయత్నిస్తామని దుబాయ్ అంబులెన్స్ ప్రతినిథులు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సహా, అంబులెన్స్‌లో ఉండే చాలా సౌకర్యాల్ని ఇందులో పొదుపర్చారు. ఇటీవలే డిసిఎస్ బైసికిల్ అంబులెన్స్‌ని కూడా ప్రారంభించింది. ప్రమాదంలో ఉన్నవారిని వీలైనంత తక్కువ సమయంలో రక్షించేందుకు, వారికి వైద్య సహాయం అందించేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు డిఎసిఎస్ చెప్పింది
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!