శ్రీశైలం రహదారిపై ఇక రాత్రివేళ వాహనాల రాకపోకలు నిషేధం

- February 01, 2018 , by Maagulf
శ్రీశైలం రహదారిపై ఇక రాత్రివేళ వాహనాల రాకపోకలు నిషేధం


హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతమైన రాజీవ్ గాంధీ అభయారణ్యంలో రోడ్డు ప్రమాదాల బారినుంచి వన్యప్రాణుల పరిరక్షణ కోసం హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కవగా నడపరాదని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.దీంతోపాటు రాత్రివేళ ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న వాహనాల వల్ల పలు వన్యప్రాణులు మరణించిన నేపథ్యంలో కొత్తగా వాహనాల వేగనియంత్రణకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, వైద్యులు, ఇంజనీర్లతో జరిపిన వన్యప్రాణుల సర్వేలో వెల్లడైన వాస్తవాలతో ఇకనుంచి వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com