'పంజాగుట్ట' రూమ్‌లో త్రివిక్రమ్ కొత్త కసరత్తులు
- February 01, 2018
ఏ ముహూర్తాన టైటిల్ ఫిక్స్ అయ్యిందోకానీ 'అజ్ఞాతవాసి'తో యూనిట్‌కి, ఇండస్ట్రీకి ఊహించని షాక్ తగిలింది. పవన్ ఎట్టకేలకు తేరుకొని సినిమాలకు బై అనేసి.. పొలిటికల్ టూర్స్ స్టార్ట్ చేశాడు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు.. ప్లాప్‌కి తోడు కాపీ వివాదం వెంటాడుతోంది. ఇప్పటికే అజ్ఞాతవాసంలోవున్న త్రివిక్రమ్, తనకు లక్ తెచ్చిన పంజాగుట్ట రూమ్‌లో తారక్ ప్రాజెక్ట్‌కి స్టోరీ రెడీ చేస్తూ బిజీ అయ్యాడట.
స్టోరీల కోసం ఫారిన్‌లో సిట్టింగ్స్ చేసే త్రివిక్రమ్.. బ్యాక్ టు బేసిక్స్‌కు వచ్చాడని ఇండస్ట్రీ టాక్. తారక్‌తో చేయబోయే మూవీకి డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు నవల రైట్స్ తీసుకున్నట్టు వార్తలు వచ్చినా, అదేం లేదని ఈసారి పక్కాగా ముగ్గురు అసిస్టెంట్స్‌తో తానే కూర్చుని లవ్ ఎంటర్టైనర్ రెడీ చేస్తున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌కు వెళ్లెవరకూ త్రివిక్రమ్ అజ్ఞాతంలోనే ఉంటాడని ఇన్‌సైడ్ టాక్.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు