రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- February 02, 2018
రస్ అల్ ఖైమాలో ఓ ట్యాక్సీకి జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణీకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అల్ ఘయిల్ ప్రాంతంలోని అంతర్గత రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని, ఒకరు మృతి చెందారని చెప్పారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్తోపాటుగా అంబులెన్స్, పారా మెడిక్స్ మరియు రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి గురైన కారుని తొలగించి, ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. గాయపడ్డవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి