ప్రపంచకప్ గెలిచిన భారత్.. చరిత్ర సృష్టించారు!

- February 03, 2018 , by Maagulf
ప్రపంచకప్ గెలిచిన భారత్.. చరిత్ర సృష్టించారు!

ప్రపంచకప్ లో యువ ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. అండర్ 19 ప్రపంచకప్ లో ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించి జయహో భారత్ అంటూ... నినాదాలు చేశారు. ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీని గెలచుకున్న టీమిండియా. నాలుగోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్ వేదికగా అండర్ -19 ప్రపంచకప్ టోర్నీ.. ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన ఆస్ట్రేలియా 216 పరుగులు చేసి అల్ అవుట్ అయింది. 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 వికెట్ల నష్టానికి మరో పన్నెడు ఓవర్లు మిగిలి ఉండగానే  220 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దీంతో ప్రపంచకప్ ఫైనల్లో నాలుగోసారి గెలిచారు. ఇదిలావుంటే భారత్ ఆటగాడు మన్‌జోత్‌ కర్లా సెంచరీ సాధించాడు. మొత్తం 101 బంతుల్లో 100 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు..  టీంఇండియా మాజీ సారధి రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో యువభారత్ ను  ముందుండి నడిపించాడు.  ఈ మ్యాచ్ కు ఆటగాళ్లు ఫోన్ మాట్లాడటం, వాడటం పక్కన పెట్టాలని కోచ్ ద్రవిడ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.  ఇదిలావుంటే 2000లో మొహ్మద్‌ కైఫ్‌ సారథ్యంలో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది... అనంతరం 2008లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో... 2012లో ఉన్ముక్త్‌ చంద్‌ కెప్టెన్సీలో భారత్‌ మరో రెండుసార్లు ప్రపంచకప్‌లను అందుకుంది.  తాజాగా పృద్వి షా సారథ్యంలో నాల్గవసారీ గెలిచి  యువభారత్ చరిత్ర సృష్టించింది  అయితే అండర్‌-19 వరల్డ్‌ కప్‌ చరిత్రలో అత్యధికసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన ఘనత భారత్‌-ఆసీస్‌లది. కాగా నేటి ఫైనల్ లో విజేతగా నిలిచిన భారత్ నాలుగు సార్లు ప్రపంచకప్ సాధించి  మొదటి స్థానంలో నిలిచింది. మరోసారి భారత్ ప్రపంచకప్  గెలవడంతో దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com