ఐస్‌ ట్రే పై 'ఘూమర్' నృత్యం..

- February 03, 2018 , by Maagulf
ఐస్‌ ట్రే పై 'ఘూమర్' నృత్యం..

ఎన్నో వివాదాలు మరెన్నో గొడవలు ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కిన 'పద్మావతి'.. రిలీజ్ అయ్యి అందర్నీ మెప్పించింది. విజయఢంకా మోగిస్తోంది. ఇక ఆ చిత్రంలోని 'ఘూమర్' పాటకు దీపిక చేసిన నృత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ పాటకు దేశ విదేశాల్లోని అభిమానులు స్టెప్పులు వేస్తున్నారు. మయూరీ భండారి అనే యువతి ఐస్‌ ట్రే పైన స్కేట్స్ ధరించి ఈ పాటకు నృత్యం చేసింది. 'ఘూమర్ ఆన్ ఐస్' పేరుతో ఈ న‌ృత్యం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పద్మావతి విజయానికి అభినందనలు తెలుపుతూ ఈ నృత్యం చేసినట్లు మయూరి తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com