యు.ఏ.ఈ లోని అజ్మాన్ లో అంగరంగ వైభవంగా 'శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం'
- February 03, 2018యు.ఏ.ఈ:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అజ్మాన్లోని ఇండియన్ అసోసియేషన్ హాల్ ఈ ఉత్సవానికి వేదికయ్యింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 14 వేల మందితో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఓం నమో వెంకటేశాయ నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సంవత్సరం కల్యాణంతో పాటు పుష్ప యాగం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్‌ని ఏర్పాటు చేశారు. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మరియు నృత్యాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వెంకటేశ్వరస్వామి కళ్యాణానికి ఇంత పెద్దయెత్తున భక్తులు హాజరవడం, ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం గొప్ప విషయం. 'సంప్రదాయం' టీం వారి ఆధ్వర్యంలో ఈ వేడుక అద్భుతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో తిరుపతి నుంచి పరదాల మణి,శశిధర్ బాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో APNRT మెంబర్షిప్ డ్రైవ్ కి అనుమతి ఇచ్చిన 'సంప్రదాయం' టీం వారికి APNRT కో-ఆర్డినేటర్స్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి